Tuesday, January 14, 2025

ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్‌సర్కూట్.. ఒకే ఇంటిలో నలుగురు చిన్నారుల మృతి

- Advertisement -
- Advertisement -

మేరఠ్ : సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్యూట్‌తో మంటలు చెలరేగి, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్‌లో ఈ సంఘటన జరిగింది. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా, షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగి బెడ్‌షీట్‌కు అంటుకున్నట్టు మృతుల తండ్రి జానీ తెలిపారని పోలీసులు వెల్లడించారు.

మృతులను సారిక(10), నిహారిక (8), శంకర్(6), కలు(4)గా గుర్తించారు. కూలిపని చేస్తున్న జారీ ఈ ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడగా, అతడి భార్య లలితకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News