Tuesday, December 24, 2024

దోపిడికి పాల్పడిన మహిళా ఎస్ఐతోపాటు ముగ్గురు పోలీసులు అరెస్టు..

- Advertisement -
- Advertisement -

రాత్రి పెట్రోలింగ్ చేస్తూ దోపిడికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఓ మహిళా ఎస్ఐతోపాటు ముగ్గురు పోలీసులు అరెస్టు అయ్యారు. ఈ ఘటన బిహార్ రాజధాని పాట్నాలోని బ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసులో ఓ కానిస్టేబుల్, హోంగార్డు, పోలీస్ డ్రైవర్ తోపాటు మహిళా ఎస్ఐని అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

ఈ నలుగురు పెట్రోలింగ్ బృందం బ్యూర్ ప్రాంతంలో రాత్రి పెట్రోలింగ్ సమయంలో అక్రమంగా జనాల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని, గత మంగళవారం ఓ వ్యక్తి నుంచి రూ.30,000 వసూల్ చేశారని సమచారం అందడంతో విచారణ జరిపి నలుగురిని అరెస్టు చేసినట్లు పాట్నా సిటి సూపరిండెంట్ ఆఫ్ పోలీసు వైభవ్ శర్మ తెలిపారు. ఇందులో మరో పోలీస్ ప్రమేయం కూడా ఉందని, ప్రస్తుతం అతను పరారిలో ఉన్నట్లు చెప్పారు. అరెస్టైన పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News