Wednesday, January 22, 2025

చాటింగ్‌తో.. చీటింగ్

- Advertisement -
- Advertisement -

4 Crore loot from 60 girls on Instagram at hyderabad

హై ప్రొఫైల్ ఉన్న అమ్మాయిలే టార్గెట్
60 మంది నుంచి రూ.4 కోట్ల వసూలు
నిందితుడి అరెస్ట్…రిమాండ్

హైదరాబాద్: ఇస్ట్రాగ్రామ్ వేదికగా 60 మంది అమ్మాయిలకు వల వేసి రూ.4కోట్లు వసూలు చేసిన చీటర్ వంశీకృష్ణను హైదారబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వంశీకృష్ణ వలలో పడి రూ.25 లక్షల మోసపోయిన అమెరికాలో ఉండే హైదరాబాద్‌కి చెందిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈక్రమంలో తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సైబర్ క్రైం పోలీసులు పిటీ వారెంట్ పై నిందితుడు జోగడ వంశీకృష్ణను అదువులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే…ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ బిటెక్ పూర్తి చేశాడు. ఇస్ట్ట్రాగ్రామ్‌లో అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశాడు. తప్పుడు సమాచారంతో క్రీయేట్ చేసిన ఫేక్ అకౌంట్లతో తానకు తాను హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తినని, చాలా మంది అమ్మాయిలు తనతో ఫ్రెండ్ షిప్ కోసం తపిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో హై ప్రొఫైల్ ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేసి వారితో చాటింగ్ మొదలుపెట్టాడు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 60 మంది అమ్మాయిలతో పరిచయం పెంచుకుని ఆ తర్వాత వారితో చాటింగ్ చేస్తూ డబ్బు వసూలు చేయటం మొదలు పెట్టాడు. ఇన్‌స్ట్రా గ్రామ్‌లో తనతో పరిచయం పెంచుకున్న వారి నుంచి సుమారు రూ. 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన మోసం చేసినట్టుగా సైబర్ క్రైం పోలీసుల విచారణలో తేలింది. అమ్మాయిలను వంచించిన కేసులో నిందితుడు వంశీకృష్ణ పై గతంలో రాచకొండ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, భీమవరం, వైజాగ్, కరీంనగర్, విజయవాడలలో ఇదే తరహా పలు కేసులు నమోదైనట్టుగా పోలీసులు వివరించారు.బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేపడతామని సైబర్ క్రైం పోలీసులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News