Sunday, December 22, 2024

కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరంగా 4 కోట్ల మంది

- Advertisement -
- Advertisement -

4 crore eligible beneficiaries have not taken vaccine

లోక్‌సభలో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై 18 నాటికి దాదాపు 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు మొదటి డోసు కరోనా వ్యాక్సినేషన్ కూడా తీసుకోలేదని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. జులై 18వ తేదీ వరకు ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో 178,38,52,566 వ్యాక్సిన్ డోసులను1(97.34 శాతం) ఉచితంగా అందచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. జులై 18 నాటికి 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు కొవిడ్ వ్యాక్సిన్ సింగిల్ డోసు కూడా తీసుకోలేదని ఆమె తెలిపారు. హెల్త్‌వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 సంవత్సరాలు పైబడిన లబ్ధిదారులు అందరికీ ఈ ఏడాది మార్చి నుంచి ఉచిత ప్రికాషన్ డోసులు ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల(సివిసి)లో అందుబాటులో ఉన్నాయని, అదే విధంగా 18-59 వయసు వారికి ఏప్రిల్ 10 నుంచి ప్రైవేట్ సివిసిలలో అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News