Monday, December 23, 2024

4 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేశారు

- Advertisement -
- Advertisement -
4 crore people pushed into poverty Says Rahul Gandhi
మోడీ సరార్‌పై రాహుల్ వ్యంగ్య బాణాలు

న్యూఢిల్లీ: బిజెపి ప్రభుత్వ హయాంలో దేశంలో నాలుగు కోట్ల మందికి పైగా జనాన్ని పేదరికంలోకి నెట్టేశారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘హమారే దో’ మాత్రమే అభివృద్ధి చెందుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.4 కోట్ల మందికి పైగా అక్కచెల్లెళ్లు పేదరికంలోకి నెట్టగా కేవలం ఇద్దరికి మాత్రమే ‘వికాస్ ఓవర్‌ఫ్లో’ అవుతోందని రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ నాలుగు కోట్ల మందిలో ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తి అని, వీరందరికీ మెరుగైన జీవితం లభించాల్సి ఉందని ‘ బిజెపిఫెయిల్స్ ఇండియా’ హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన ఆ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు. 2021 వ సంవత్సరంలో ఇద్దరు అగ్రశ్రేణి వ్యాపారవేత్తల (అంబానీ, అదానీ)సంపద కోట్ల రూపాయలు పెరగ్గా, 2020 నుంచి నాలుగు కోట్ల మందిపేదరికం దిగువకు వెళ్లిపోయారంటూ ఆక్స్‌ఫామ్ నివేదికలో పేర్కొన్న విషయాన్ని కూడా ఆయన ఆ ట్వీట్‌లో గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News