ముంబై: పాత్రాచాల్ భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్టు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను పిఎంఎల్ఏ కోర్టు ముందు సోమవారం మధ్యాహ్నం హాజరుపరిచారు. ఆయనను 8 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడంతో నాలుగురోజుల పాటు కస్టడీకి కోర్టు అనుతించింది.
లెక్కల్లో చూపించని రూ.11.5 లక్షల నగదును సంజయ్ రౌత్ నివాసం నుంచి ఈడి ఆదివారంనాడు స్వాధీనం చేసుకుంది. దీనిపై ఈడి అధికారులు ఆయనను విచారించి సోమవారం మధ్యాహ్నం 12.05 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం పిఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరిచారు. కాగా, సంజయ్ రౌత్ అరెస్టును రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేసినట్టు ఆయన తరఫు న్యాయవాది అశోక్ ముండర్గి చెప్పారు. రౌత్ హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారని, సర్జరీ కూడా చేయించుకున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన పేపర్లు కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.
Mumbai | Sanjay Raut was arrested late night y'day. His medical checkup was done today & he was taken to court. We have faith in judiciary, we believe he'll be released soon. ED demanded 8 days of custody but was granted only 4: Sunil Raut, brother of Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/XtXfI4rssV
— ANI (@ANI) August 1, 2022