Sunday, December 22, 2024

4 రోజులే

- Advertisement -
- Advertisement -

ప్రచారానికి సమీపిస్తున్న గడువు

హోరెత్తిస్తున్న పార్టీలు గెట్ టు గెదర్

పార్టీలు, తాయిలాల పంపకాలు షురూ

జీవనోపాధికి వలస వెళ్లిన వారిపై పార్టీల వల

రానూపోను వాహనాల ఏర్పాటు యువతపైనే అన్ని పార్టీల దృష్టి

ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న స్వతంత్రులు

మన తెలంగాణ/హైదరాబాద్ :  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జోరు పెరు గుతోంది. ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజు ల్లో పూర్తి కానుంది. ఈనెల 28న సాయంత్రం ఐదు గం టలకు ప్రచారం పూర్తి కానుండడంతో అన్ని పార్టీల నేతలు ఓటర్లకు గాలాలు వేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వివిధ సం ఘాల భవనాలలో గెట్ టు పార్టీలు ఇస్తు న్నారు. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీలు ఏ పార్టీ ఎన్ని డబ్బులు, మద్యం పంచుతుందో తెలుసుకుని అంతకుమించి పంచేందుకు ఇత రులు పోటీ పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాదులోని ఒక నియోజకవర్గం లో ఇప్పటికే కుక్కర్లను సైతం పంపిణీ చేశారు. కొన్నిచోట్ల నాయకు లు యువతకు క్రికెట్ కిట్లు, గోవా వెళ్లేందుకు బస్సులు బుక్ చేసి ఇస్తున్నారని చర్చ తీవ్రస్థాయిలో కొనసాగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు అధికార బిఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే రెండు దఫాలు అధికారాన్ని దక్కించుకున్న బిఆర్‌ఎస్ మూడోసారి అ ధికారం కోసం ఓటర్లను అభ్యర్ధిస్తోంది. ఇక కాంగ్రెస్ కు ఈ ఎన్నిక లు గెలవడం తప్పనిసరి. ఇక బిజెపి తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను ఓ డించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా నియోజక వ ర్గాల్లో ఓటు హక్కు కలిగి ఉండి ఇతర ప్రాంతాల్లో జీవనోపాధికి వెళ్లి న వారిని సైతం నియోజకవర్గాలకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాధి కోసం ఆయా గ్రామాల నుండి హైదరాబాద్ వంటి నగరా లకు, పట్టణాలకు వెళ్లిన వారికి ఈ సమయంలో డిమాండ్ బాగా పెరిగింది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు వారికి ఫోన్లు చేసి ఓటేయటానికి రమ్మని ప్రాధేయ పడుతున్నారు. రాను పోను ఖర్చులు తామే భరిస్తామని చెబుతూ రమ్మని పిలుస్తున్నారు. వారు రావటానికి కొన్ని నియోజక వర్గాలలో అయితే ఏకంగా వాహనాలను పెడుతున్నారు. చెన్నై, ముంబై, షోలాపూర్ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిన వారిని కూడా రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బుల ఖర్చు ఎంతైనా సరే ప్రతీ ఓటు ముఖ్యమే అని నేతలు ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను రప్పించే పనిలో పడ్డారు.మాకే ఓటు వెయ్యాలని ఎవరికి వారు వారిని అడుగుతున్నారు. దీంతో ఏ పార్టీ వారికి ఎస్ చెప్పాలి అన్నది వారికి కన్ఫ్యూజన్ గా మారింది. ఇక నియోజకవర్గాల్లో యువతను తమ వైపుకు తి ప్పుకుని తద్వారా ఓట్లను రాబట్టేందుకు ప్రధాన పార్టీలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నాయి. యువతను ఆకర్షించే పనిలో ఇప్పటికే బిఆర్‌ఎస్ పార్టీ ముందజంలో ఉంది. కాం గ్రెస్, బిజెపిలు సైతం యువతను ఆకర్షించడంలో తమ వంతు ప్రయత్నాలకు పదును పెడుతున్నాయి.
ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్న స్వతంత్రులు
మరోవైపు రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తుండటం అందుకు కారణం. చైతన్యవంతమైన రాష్ట్రం కావడంతో పార్టీకన్నా, గుర్తుల కన్నా, వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో గత ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థుల విజయం సాధించారు. అంతే కాదు 119 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు పోలయిన ఓట్ల శాతాన్ని చూసి ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి దిగిన అభ్యర్థులకు 6.7 శాతం ఓట్లు పోలయ్యాయంటే వారిని తక్కువగా చూడలేని పరిస్థితి. ప్రజలు కూడా వారిని అక్కున చేర్చుకుంటున్నారన్న విషయం అర్థమయింది.
ఖమ్మంలో టఫ్ ఫైట్…
అటు ఆంధ్ర ఇటు తెలంగాణ సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఎప్పుడు విభిన్నమైన తీర్పే వెలువడుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా ‘ఆపరేషన్ ఆకర్ష్’ మంత్రాన్ని పార్టీలు పటిస్తున్నాయి. ప్రధాన పోటీదారులుగా ఉన్న బిఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విమర్శనాస్త్రాలు విసురుకుంటూనే పార్టీలో చేరికలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రత్యర్థి పార్టీలోని కీలక నాయకులను ఆకర్షించేందుకు ఇద్దరు నేతలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.

ఖమ్మం నియోజకవర్గంలో మూడు లక్షల పైచిలుకు ఓటర్లు ఉండగా ఎవరు గెలిచినా పదివేల మె జారిటీ మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగా ఇక్కడ టఫ్ ఫైట్ కొనసాగనుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి తుమ్మల గతంలో 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి తనయుడు జలగం వెంకట్రావుపై విజయం సాధించా రు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన తుమ్మలపై నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ గెలుపొందారు. 2018 ఎన్నికల్లో జిల్లాలోని ఏ కైక ఎంఎల్‌ఎగా ఖమ్మం నుంచి బిఆర్‌ఎస్ తరఫున అజయ్ కు మార్ విజయం సాధించారు. తాజాగా ఈ ఇద్దరు నేతలు మరో పర్యాయం పోటీ పడడం, బలాబలాల ప్రదర్శనకు దిగుతుండ డం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ స్థానంలో ఎవరు గెలిచినా పదివేల స్వల్ప మెజారిటీతోనే విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
దేవరకొండ ఆసక్తికరం…
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏకైక ఎస్‌సి రిజర్వుడు నియోజకవ ర్గం దేవరకొండ. దేవరకొండ నియోజకవర్గం ఎస్‌టిలకు రిజ ర్వు కాకముందు అంటే 1952 నుంచి 1972 దాకా జనరల్ స్థానంగా ఉండింది. జరిగిన అయిదు ఎన్నికల్లో వామపక్షాలు మూడు పర్యాయాలు, కాంగ్రెస్ రెండు సార్లు గెలిచాయి. 1978 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గం ఎస్‌టిలకు రిజర్వు అయ్యింది. అప్పటి నుంచి ఒక ఉప ఎన్నిక సహా 11 సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ అయిదు సార్లు, కమ్యూనిస్టులు (సిపిఐ) అయిదు సార్లు గెలిచాయి. బిఆర్‌ఎస్ కేవలం ఒకే ఒక సారి 2018 ఎన్నికల్లో విజయం సాధించింది. స్థానికేతర నా యకులు సైతం ఇక్కడి నుంచి విజయాలు సాధించారు. కాంగ్రె స్ నుంచి 1978, 1983 లో వరసగా కాంగ్రెస్ నుంచి గెలిచిన డి. రవీంద్ర నాయక్ వరంగల్ జిల్లా వాసి. అదే మాదిరిగా సిపి ఐ నుంచి 1985, 1989, 1994 లో వరసగా మూడు పర్యాయాలు గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసిన బద్దూ చౌహాన్ కూడా వరంగల్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. 1999లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాగ్యానాయక్ జిల్లాకు చెందిన వ్యక్తే అయినా, ఆయన మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన వా రు. 2002లో జరిగిన ఉప ఎన్నిక ఇక్కడ ఏకగ్రీవం అయ్యింది. అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ చేతిలో ఎమ్మెల్యే రాగ్యానాయక్ హత్యకు గురికాగా, కాంగ్రెస్ పార్టీ రాగ్యానాయక్ ఆయన భార్య భారతికి టికెట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఏ పార్టీ బరిలోకి దిగకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత బిఆర్‌ఎస్ అభ్యర్థి ఎంఎల్‌ఎ రవీంద్ర కుమార్ 2004 ఎన్నికల్లో సిపిఐ నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో పొత్తుతో ఆయన సిపిఐ నుంచి గెలిచినా ఆ తర్వాత బిఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గెలిచి ఇపుడు మూడో సారి విజయం కోసం పోటీలో ఉన్నారు. కాగా, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన బాలూ నాయక్ ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచే బరిలో నిలబడ్డారు. దీంతో దేవరకొండలో పోటీ ఆసక్తికరంగా మారింది.
నకిరేకల్‌లో ముఖాముఖీ…
2023 ఎన్నికల్లో నకిరేకల్‌లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు ఎ స్‌సి రిజర్వుడు నియోజక వర్గాల్లో నకిరేకల్ ఒకటి. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో జనరల్ స్థానం నుం చి ఎస్‌సి రిజర్వుడు కోటాలోకి మారింది. అంటే 2009 ఎన్నికల నుంచే ఇక్కడ ఎస్‌సి అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. 1957 నుంచి 2004 ఎన్నికల వరకు ఈ నియోజకవర్గంలో 11 ఎన్నికలు జరిగితే కేవలం ఒకే ఒక్క సారి 1972లో కాంగ్రె స్ గెలవగా మిగిలిన పది ఎన్నికల్లో వామపక్షాలు గెలిచాయి. జనరల్ స్థా నం నుంచి ఎస్సీలకు రిజర్వు అయిన తర్వాత జరిగిన మూ డు ఎన్నికల్లో సిపిఎం ఒక్క ఎన్నికల్లోనూ గెలవలేక పోయింది. ఈ మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సార్లు, బిఆర్‌ఎస్ ఒక సారి గెలిచాయి. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ముఖా ముఖి పోరు జరగనుంది. 2014లో బిఆర్‌ఎస్ నుంచి వేముల వీరేశం, కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్యలు పోటీపడగా వీరేశం గెలిచారు. 2018 ఎన్నికల్లో సైతం ఈ ఇద్దరే ప్రత్యర్థులు కాగా, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్య విజ యం సాధించగా, వీరేశం ఓటమి పాలయ్యారు. 2023 విషయానికి వస్తే సిట్టింగ్ ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్యకే బిఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడంతో, బిఆర్‌ఎస్‌లో చివరికంటా కొనసాగిన మాజీ ఎంఎల్‌ఎ వేముల వీరేశం వేరు దారి చూసుకోవాల్సి వచ్చింది. బిఆర్‌ఎస్‌లో టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరపున పోటీలో నిలిచారు.
కీలకం కానున్న గ్రేటర్ హైదరాబాద్..
అసెంబ్లీ ఎన్నికంటే రాష్టమంతా ఓ ఎత్తు గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఓ ఎత్తు అన్నట్లుగానే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలోని 119 నియోజ కవర్గాల్లో 24 నియోజకవర్గాలు ఇక్కడే ఉన్నా యి. దాదాపు కోటి మంది ఓటర్లు జీహెచ్‌ఎంసీ పరిధిలోని సీట్ల లో ఫలితాలను నిర్ణయిస్తారు. ఇందులో ఈసారి ఏం జరగబోతోందనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో ఓ 9 సీట్లలో మాత్రం ఎంఐ ఎం, బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. మిగిలిన 15 నియోజకవర్గాల్లో ప్రధానంగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అలాగే గ్రేటర్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో మైనార్టీలైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు ఇక్కడి ఓటర్లలో దాదాపు మూడిం ట ఒక వంతు మంది ఉన్నారు. దీంతో ఈసారి వీరి మొగ్గు ఎటు? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News