ఆటోను ఢీకొట్టిన కంటైనర్
సంగారెడ్డి జిల్లా ఆంథోల్ మండలంలో ఘోరవిషాదం
మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి: రోడ్డు ప్రమాదం నలుగురిని బలిగొన్నది. సంగారెడ్డి జిల్లా ఆంథోల్ మండలం అల్మాయిపేట వద్ద ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శుభకార్యంలో పాల్గొనేందుకు సంగారెడ్డి శివాజీనగర్‌కు చెందిన చెన్న శ్రావణ్, అతని బంధుమిత్రులు మ ండలం మన్‌సాన్‌పల్లికి ఆటోలో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృ తి చెందారు. కంటైనర్ ధాటికి ఆటో తునాతునకలయింది. ఆటోలో ప్రయాణిస్తున్న సాయివిఘ్నేష్ (11), సాయి చరణ్ (7)తో పాటు, వారి తండ్రి చెన్న శ్రావణ్(43) ప్రమాద స్థలిలోనే దుర్మరణం చెందారు. ఇక గాయపడిన వారిని సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, హైదరాబాద్ రామంతపూర్‌కు చెందిన వెంకటేశ్ అనే ఆటో డ్రైవర్ చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారికి సంగారెడ్డి ఆస్పత్రిలో వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటన తో నాందేడ్ హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయి, చాలా సేపటి వరకు రవాణాకు అంతరాయం కలిగింది.
ఆగివున్న కంటైనర్ ఢీకొట్టి ముగ్గురు మృతి
మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నుంచి వచ్చిన కారు శామీర్‌పేట్ ఔటర్ ఎక్కిన కొద్ది దూరంలోనే ఆగి ఉన్న కంటైనర్‌ను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సంధ్య, సరళ సహా కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడిక్కక్కడే మృతి చెందారు. వారు గజ్వేల్ నుంచి ఉప్పల్ చిలుకనగర్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంలో ఒఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టినా వాహనదారుల్లో మార్పు కనిపించడంలేదు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.
4 dead in Road Accident in Sangareddy