Sunday, January 19, 2025

బల్టిమోర్ పార్టీ వేడుకల్లో కాల్పులు..నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా లోని బల్టిమోర్ నగరంలో ఆదివారం ఒక పార్టీపై సాయుధుడైన దుండగుడు కాల్పులు జరపడంతో నలుగురు మృతిచెందారు. 25 మంది గాయపడ్డారు. బల్టిమోర్‌కు చెందిన బ్రూక్లిన్ పొరుగు ప్రాంతంలో వందమందితో పార్టీ నిర్వహిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.

కనీసం 30 రౌండ్లు పేల్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారని వార్తా కథనాలు వివరించాయి. బ్రూక్లిన్‌డే సందర్భంగా వార్షిక వేడుకలు నిర్వహిస్తుండగా కాల్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నాయి. బాల్టిమోర్ పోలీస్‌లు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News