న్యూఢిల్లీ: ఈ వారం ఉత్తర భారతంలో ఉష్ణోగ్రత బాగా పడిపోయింది. వచ్చే వారం కల్లా ఉత్తర భారతంలో మైనస్ నాలుగు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగలదని ఓ వాతావరణ నిపుణుడు తెలిపారు. జనవరి 14 నుంచి19 వరకు తీవ్ర చలిగాలులు వీచనున్నాయి. కాగా జనవరి 16 నుంచి 18 మధ్య అవి తీవ్ర స్థాయిని చేరుకోనున్నాయని నవదీప్ దహియా ట్వీట్ చేశారు. ఆయన ‘లైవ్ వెధర్ ఆఫ్ ఇండియా’ వ్యవస్థాపకుడు. 21వ శతాబ్దిలో ఇదే అత్యంత శీతల కాలం కాగలదని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు.
గత కొన్ని వారాలుగా రాత్రి పూట చలి తీవ్రంగా ఉంటోంది. 23 ఏళ్ల తర్వాత ఇదే అత్యంత చలికాలం అని ఆయన పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉండింది. ఇదివరలో 2006లో, 2013లో ఇంతలా చలి ఉండిందని మరో వాతావరణ నిపుణుడు ఆర్‌కె. జెనమని ఓ వార్తా సంస్థకు తెలిపారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ యూపి, ఉత్తర రాజస్థాన్ లో అక్కడక్కడ చినుకులు కూడా పడవచ్చని జెనమని తెలిపారు.
Don't know how to put this up but upcoming spell of #Coldwave in #India look really extreme during 14-19th January 2023 with peak on 16-18th, Never seen temperature ensemble going this low in a prediction model so far in my career.
Freezing -4°c to +2°c in plains, Wow! pic.twitter.com/pyavdJQy7v— Weatherman Navdeep Dahiya (@navdeepdahiya55) January 11, 2023