Saturday, March 1, 2025

ఉత్తరాఖండ్ ఘటనలో విషాదం.. నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఛమోలీ జిల్లాలోని మనా గ్రామంలో 57 మంది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బిఆర్ఒ) కార్మికులు శుక్రవారం విరిగిపడిన మంచు చరియల కింద చిక్కుకుపోయారు. వెంటనే స్పంధించిన ఆర్మీ, బిఆర్‌ఒ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకున్న వారిలో దాదాపు 50 మందిని బయటకు తీశారు. బద్రీనాధ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని మనా భారత, టిబెట్ సరిహద్దులో 3200 మీటర్ల ఎత్తున ఉన్న చివరి గ్రామం.

అయితే మంచుచరియల కింద చిక్కుకొని బయటపడిన వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని హెలికాప్టర్‌లో జోషిమఠ్‌లోని సివిల్ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంచులో చిక్కుకుపోయిన.. మరో ఐదుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇంకా ఆలస్యం అయ్యే కొద్ది సహాయకచర్యలు నిర్వహించడం కష్టం అవుతుంది. దీంతో అధికారులు సహాయకచర్యలు వేగవంతం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News