Saturday, December 21, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

4 Died in Road Accident in Prakasam District

అమరావతి: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం యర్రగొండపాలెం మండలంలోని కొత్తపల్లి రహదారిపై ప్రమాదవశాత్తు ఓ కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు సంఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

4 Died in Road Accident in Prakasam District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News