Wednesday, January 29, 2025

ఎపిలో కారు ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం చిట్లూరు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కారులో కడప నుంచి రాయచోటి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News