Friday, November 22, 2024

వివోపై మనీలాండరింగ్ కేసు: నలుగురు ఎగ్జిక్యుటివ్‌ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనాకు చెందిన వివో మొబైల్ కంపెనీతో సంబంధమున్న నలుగురు ఎగ్జిక్యూటివ్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో ఒక చైనా పౌరుడు, ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఇద్దరు ఇతరులు ఉన్నారు. వివో కంపెనీపై నమోదైన మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈ నలుగురినీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

అరెస్టయిన వారిలో గ్వాంగ్వెన్ కియాంగ్ అలియాస్ ఆండ్య్రూ కువాంగ్(చైనా జాతీయుడు), హరి ఓం రాయ్(లావా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్), చార్టెర్డ్ అకౌంటెంట్ నితిన్ గర్గ్, రాజన్ మాలిక్ అనే వ్యక్తి ఉన్నారు.గత ఏడాది జులై 5వ తేదీన వివో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పైన, దానికి సంబంధించిన 23 సంస్థల పైన ఇడి దాడులు నిర్వహించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News