- Advertisement -
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై డాక్టర్, పోలీస్ సహా నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఎస్‌ఎంహెచ్‌ఎస్ ఆస్పత్రి శ్రీనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడిసిన్) డాక్టర్ నిసారుల్ హసన్, కానిస్టేబుల్ అబ్దుల్ మాజీద్‌భట్, లేబొరేటరీ బేరర్ అబ్దుల్ సలాం రాదర్, టీచర్ ఫరూక్ అహ్మద్ మిర్‌లను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడమే తమ ప్రభుత్వ విధానమని, జమ్ముకశ్మీర్‌ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా మలిచేందుకు ఎల్‌జి యంత్రాంగం కట్టుబడి ఉందని ప్రభుత్వం పేర్కొంది.
- Advertisement -