- Advertisement -
జబల్‌పూర్: అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న మామిడి పండ్లు దొంగల పాలు కాకుండా ఉండేందుకు ఆరు శునకాలను, నలుగురు సిబ్బందిని కాపలాగా నియమించారు. మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ జిల్లాకు చెందిన రాణి, సంకల్ప్ పరిహార్ దంపతులు తమ మామిడి తోటలో రెండు మొక్కలను నాటారు. అవి పెరిగి పెద్దగా కావడంతో గతేడాది మామిడి పండ్లు పండాయి. అయితే అవి రూబీ కలర్‌లో ఉండటంతో వాటిని జపాన్‌కు చెందిన మియాజాకీ మామిడి పండ్లు అని తేలింది. వీటి ధర అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ. 2.70 లక్షలు. ఈ మామిడికి భారీ ధర పలకడంతో పోయిన ఏడాది వాటిని దొంగిలించారు. దీంతో ఈ ఏడాది ఆ రెండు చెట్లకు పండిన ఏడు మామిడి పండ్లకు ఆరు శునకాలు, నలుగురు సిబ్బందిని కాపలాగా ఉంచారు.
4 Guards and 6 Dogs to Protect 7 Mangoes in Jabalpur
- Advertisement -