Monday, December 23, 2024

4 గుజరాత్ గ్రామాలు దాద్రాలో విలీనం

- Advertisement -
- Advertisement -

4 Gujarat villages merged in Dadra

కేంద్ర హోంశాఖ చర్చలు

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా-నగర్ హవేలీ, దామన్-డయ్యూలకు గుజరాత్ రాష్ట్రంలోని కొంత స్థలాన్ని, నాలుగు గ్రామాలను బదిలీ చేయడంపై గుజరాత్, కేంద్ర పాలిత ప్రాంత ప్రతినిధులతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ చర్చలు జరిపింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మంగళవారం ప్రభుత్వ అధికారులు తెలిపారు. దక్షిణ గుజరాత్‌లోని వల్సద్ జిల్లాకు చెందిన మేఘ్వల్, నగర్, రాయ్‌మల్, మధుబన్ గ్రామాలతో పాటు సౌరాష్ట్రకు చెందిన ఘోఘల గ్రామానికి చెందిన కొంత భూమిని కేంద్ర పాలిత ప్రాంతంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై ఇటీవల చర్చలు జరిగినట్లు వారు చెప్పారు. ఈ నాలుగు గ్రామాలు డయ్యూకు అత్యంత సమీపంలో ఉండగా 1989లో గుజరాత్‌కు ఇచ్చిన భూమికి బదులుగా సౌరాష్ట్రలోని కొంత భూమిని డయ్యూకు ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News