Friday, January 10, 2025

అపహరణకు గురైన భారత సిక్కు కుటుంబం హత్య

- Advertisement -
- Advertisement -

California tragedy

కాలిఫోర్నియా: అపహరణకు గురైన 8 నెలల చిన్నారి (కుమార్తె)  సహా నలుగురు సభ్యుల భారతీయ సిక్కు కుటుంబం హత్యకు గురైందనికాలిఫోర్నియా అధికారులు ఈ ప్రకటించారు. ‘‘ఇది భయంకరమైనది, అర్థం లేనిదంటూ మెర్సెడ్ కంట్రీ శాంతి భద్రతల చీఫ్ వెర్న్ వార్న్ కే వ్యాఖ్యానించారు. 36 ఏళ్ల జస్ దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి దేరి, వారి సమీప బంధువు అమన్ దీప్ సింగ్ (39) ఇండియానా రోడ్డు, హచిసన్ రోడ్డు సమీపంలో నిర్జీవంగా కనిపించినట్టు తెలిపారు.

ఓ వ్యవసాయ కార్మికుడు వీరి మృత దేహాలను చూసి అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్న్ కే వెల్లడించారు. గత సోమవారం ఉదయం వీరంతా అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన చూసి తనకు వచ్చిన కోపాన్ని వర్ణించలేనని పోలీసు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. జీసస్ మాన్యుయేల్ సల్గాడో అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడినట్టు వార్న్ కె ప్రకటించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు.  సీరియస్ గా ఉండడంతో అతడ్ని హాస్పిటల్ కు తరలించారు. జస్ దీప్ సింగ్ ఇటీవలే ట్రక్ రెంటింగ్ కంపెనీని ప్రారంభించాడు. అతడి కుటుంబ సభ్యులు అందరినీ అక్కడి నుంచే నిందితుడు అపహరించుకుపోయాడు. ఇందుకు సంబంధించిన సిసిటివి వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News