హైదరాబాద్: నిమ్స్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ ట్రాన్సాప్ల్లాంటేషన్లు నిర్వహించి అద్వితీయమైన ఘనత సాధించారు. రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం కింద పేద రోగులకు ఉచితంగా నిర్వహించారు. నాలుగు సంవత్సరాల నుంచి డయాలసిస్ చికిత్స పొందుతున్న బాధితులకు బ్రెయిన్ డెడ్ అయిన ముగ్గురు రోగుల నుంచి కిడ్నీలను మార్పిడి చేశారు. ఒకరేమో బతికుండగానే కిడ్నీని దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ నాలుగు కిడ్నీ మార్పిడి విజయవంతం అయ్యాయని నిమ్స్ వైద్యులు ప్రకటించారు.కిడ్నీలు పొందిన వారు మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందినవారు. ముగ్గురూ చివరి దశ మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్నారు. ప్రత్యక్ష సంబంధిత మార్పిడి కోసం భర్త తన భార్యకు కిడ్నీని దానం చేశాడు. వీరు హైదరాబాద్‌కు చెందినవారు. నిమ్స్‌లో నాలుగు కిడ్నీ మార్పిడి గ్రహీతలు విజయవంతమైన మూత్ర పిండ మార్పిడిని సూచిస్తూ మంచి మూత్ర విసర్జనతో బాగా పనిచేస్తున్నారు. లామినార్ ఫ్లోతో 2 ప్రత్యేక మార్పిడి ఆపరేషన్ థియేటర్ల కారణంగా ఇది సాధ్యమైందని వైద్యులు తెలిపారు.