Sunday, December 22, 2024

రామ‌గుండంలో బొగ్గు గ‌ని కూలి నలుగురు మృతి..

- Advertisement -
- Advertisement -

పెద్ద‌ప‌ల్లి: జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. సోమవారం మధ్యాహ్నం రామ‌గుండంలోని సింగ‌రేణి ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు గ‌ని పై కప్పు కూలడంతో నలుగురు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ వెంటనే అక్కడికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. రాళ్లకింద చిక్కుకున్న వారిని బయటికి తీశారు. ఈ ఘటనలో మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ మేనేజ‌ర్, ముగ్గురు కార్మికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

4 Killed after Coal Mine Collapse in Ramagundam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News