- Advertisement -
జకర్తా: ఇండోనేషియా రాజధానికి చెందిన పపువా ప్రాంతంలో నేడు 5.1 మాగ్నిట్యూడ్ భూకంపం సంభవించింది. కనీసం నలుగురు మృతి చెందారు. ఈ విషయాన్ని ‘జకర్తా పోస్ట్’ నివేదించింది. ‘ఇండోనేషియా నైరుతిలో జయపుర నగరం వద్ద మధ్యాహ్నం 1.28 గంటలకు 5.1 మాగ్నిట్యూడ్‌తో భూకంపంసంభవించింది’ అని అమెరికా జియోలజికల్ సర్వే తెలిపింది. భూకంపం 22 కిమీ. లోతుందని తెలిపింది.
జయపుర విపత్తు తీవ్రతను తగ్గించే(మిటిగేషన్) సంస్థ అధిపతి అసెప్ ఖాలీద్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ ఓ కేఫ్ ధ్వంసమై సముద్రంలో పడిపోయింది. దాంతో నలుగురు చనిపోయారు అని తెలిపారు. భూకంపం రెండు మూడు సెకండ్ల వరకు ఉన్నప్పటికీ, ప్రజలను భయానికి గురిచేసిందని తెలిపారు. కాగా జయపురలోని నివాసులు భయంతో అరుస్తూ ఇళ్లు షాపులు వదిలి పరుగులు పెట్టారని సమాచారం.
- Advertisement -