Wednesday, January 22, 2025

విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబంలోని నలుగురు మృతి..

- Advertisement -
- Advertisement -

4 Killed due to Electric Shock in Kamareddy

కామారెడ్డి: జిల్లా బీడీ వర్కర్స్ కాలనీ లో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన పట్ల సిఎం కెసిఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున సిఎం కెసిఆర్ ఆర్థిక సాయం ప్రకటించారని మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన వార్త విని కెసిఆర్ చలించిపోయారని పేర్కొన్నారు. ఇలాంటి ఘట నలు పునరావృతం కాకుండా క్షేత్ర స్థాయిలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న వెంటనే మానవతా దృక్పథంతో మృతులకు రూ.3 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించిన సిఎం కెసిఆర్‌కి మంత్రి వేముల ప్రత్యేక ధన్యవాదాలు తెలి పారు.

4 Killed due to Electric Shock in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News