- Advertisement -
గౌహతి : అసోంలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గౌహతి లోని బోరగావ్ లో కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కామాఖ్య, ఖర్గులి, హెంగేరాబరి, సిల్పుఖురి, చంద్‌మారి కాలనీలతో సహా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడిన సంఘటనల్లో ఇప్పటివరకు 42 మంది మృతి చెందారు. స్మార్ట్ సిటీ లోని వందలాది ఇళ్ల లోకి వరద నీరు ప్రవేశించింది. అన్ని ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు ప్రవేశించింది. గౌహతి రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు కూడా నీట మునిగింది. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ హెచ్చరించింది.
- Advertisement -