Thursday, December 19, 2024

కారుకు ట్రక్కు ఢీకొని నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్ : హర్యానా లోని ఝజ్జర్ జిల్లా బహదూర్‌గఢ్ సమీపంలో బుధవారం తెల్లవారు జామున కారుకు ట్రక్కు ఢీకొని అందులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు మృతి చెందారు. ఈ నలుగురిలో ముగ్గురు పిల్లలు. రాజస్థాన్ నుంచి కారులో మీరట్ వెళ్తుండగా కుండ్లీ మనేశ్వర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వేలో ఈ ప్రమాదం జరిగిందని బహదూర్‌గఢ్ సాదర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ చెప్పారు. కారు డ్రైవర్ మూత్ర విసర్జన కోసం జాతీయ రహదారి పక్కకు కారును పార్కు చేస్తుండగా, ట్రక్కు దూసుకువచ్చి కారును ఢీకొందని, నలుగురు అక్కడికక్కడే చనిపోయారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News