Sunday, December 22, 2024

ఆదిలాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి వద్ద ఈ ఘటన చోటుచేేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. చనిపోయినవారిని ఆదిలాబాద్ జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News