Sunday, December 29, 2024

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

4 Killed in Road Accident in Kadapa

అమరావతి: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం చింతకొమ్మదిన్నె మండలంలోని మధ్యమడుగులో ఓ కారు భీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఓ ఇంటి ముందు కూర్చొని ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసుద నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

4 Killed in Road Accident in Kadapa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News