Thursday, January 23, 2025

ట్రాక్టర్‌ని మోటార్ బైక్ ఢీకొని నలుగురు కుర్రాళ్లు మృతి

- Advertisement -
- Advertisement -

మీర్జాపూర్ (యూపి): ఉత్తరప్రదేశ్ సంత్ నగర్ ఏరియా గొహియా గ్రామంలో గురువారం తెల్లవారు జామున ఆగిఉన్న ట్రాక్టర్‌ను మోటార్ బైక్ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న నలుగురు కుర్రాళ్లు మృతి చెందారు. తెల్లవారు జాము 4 గంటల సమయంలో స్పీడుగా వెళ్తున్న బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని అడిషనల్ ఎస్‌పి ఒపి సింగ్ చెప్పారు. మృతులు సోమేష్ (15), అంకిత్ మిశ్రా (16), అర్పిత్ పాండే (16), గణేష్ (17) గా గుర్తించారు. వీరంతా పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీస్‌లు చెప్పారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News