Monday, January 27, 2025

జహీరాబాద్ ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు దర్మరణం

- Advertisement -
- Advertisement -

4 Killed in Road Accident in Zaheerabad

సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం మండలంలోని డిడ్గి వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దంపతులతోపాటు 8 నెలల చిన్నారి, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించినవారిని అనంతపురం జిల్లాకు చెందిన బాలరాజు, వ్రావణి, అమ్ములు, వికారాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ ఫరీద్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

4 Killed in Road Accident in Zaheerabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News