Sunday, January 19, 2025

రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి కూలీలు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా అముదాలవలసలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు దుర్మరణం పాలయ్యారు. శనివారం అముదాలవలస పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామంలో రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తున్న కూలీలపై ఓ లారీ అదుపుతప్పి వేగంగా దుసుకెళ్ళింది.

ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేను నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News