ముంబై: దక్షిణ ముంబైలో నిర్మాణంలో ఉన్న భవనం నీటి ట్యాంకును శుభ్రం చేస్తూ ఆదివారం నలుగురు కార్మికులు మృతి చెందారని అధికారులు తెలిపారు. ‘నాగ్‌పాడ ప్రాంతంలోని దిమ్తీకర్ రోడ్డులో ఉన్న బిస్మిల్లా స్పేస్ బిల్డింగ్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ట్యాంకులోకి దిగిన ఐదుగురు కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని అగ్నిమాపక్ సిబ్బంది కాపాడి జెజె ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రికి చేరిన వారిలో నలుగురు చనిపోయారని డాక్టర్లు తెలిపారు’ అని ఓ పౌర అధికారి తెలిపారు. ఆసుపత్రిలో హసిపాల్ షేఖ్(19), రజా షేఖ్(20), జియావుల్లా షేఖ్(36), ఇమాందు షేఖ్(38) చనిపోగా, పుర్హాన్ షేఖ్(31) కోలుకుంటున్నాడని ఆ అధికారి వివరించారు. ప్రమాద మరణ నివేదికను నమోదు చేసుకుని దర్యాప్తును మొదలెట్టినట్లు జెజె పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు.
ముంబైలో నీటి ట్యాంకు శుభ్రం చేస్తూ ఊపిరాడక నలుగురు కార్మికులు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -