Monday, December 23, 2024

జమ్ముకశ్మీర్‌లో నలుగురు తీవ్రవాదుల అరెస్టు..

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో లష్కర్ ఇ-తొయిబాకు చెందిన రెండు తీవ్రవాద ముఠాలను పోలీసులు పట్టుకుని నలుగురు సభ్యుల్ని అరెస్టు చేశారు. బండిపొరా లోని అష్టాంగో ప్రాంతంలో తీవ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు అనుబంధ సభ్యుల్ని అరెస్టు చేయగా, మరో సభ్యుడ్ని రాఖ్ హజిన్ చెక్‌పోస్ట్ దగ్గర అదుపు లోకి తీసుకున్నారు. వీరిని ఇర్ఫాన్ అహ్మద్ భట్, సాజద్ అహ్మద్ మీర్, ఇర్ఫాన్ అహ్మద్ జన్, ఇర్ఫాన్ అజీజ్ భట్‌గా గుర్తించారు. నిందితుల్లో ఒకరి నుంచి చైనీస్ గ్రెనేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అజీజ్‌భట్‌కు పాక్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హజిన్ ప్రాంతంలో టెర్రరిస్టు దాడులకు వీరు ప్లాన్ చేసినట్టు తెలిసింది.

4 Lashkar e Taiba associates arrest in Jammu Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News