సంగారెడ్డి: కానిస్టేబుల్‌పై కొందరు దాడికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగింది. నోవాపాన్ చౌరస్తాలో దేవీలాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినప్పుడు బాచుపల్లి స్టేషన్ కానిస్టేబుల్ కనకయ్యపై నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మారుతీ ప్రసాద్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రసాద్ కొత్త ఇంటిని నిర్మించుకొని గృహాలంకరణకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను ఐదు లక్షల రూపాయలకు దేవీలాల్‌తో ఒప్పందం చేసుకున్నాడు. దీంతో కొంత మొత్తం అడ్వాన్స్‌గా దేవీలాల్‌కు ప్రసాద్ ఇచ్చాడు. దేవీలాల్ పని చేయకుండా తిరుగుతున్నాడు. అతడి ఆచూకీ లభించకపోవడంతో కోర్టు ద్వారా దేవీలాల్‌పై ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేసిన ఎంత వెతికినా అతడు దొరకలేదు. దేవీలాల్ ఉన్న ప్రదేశానికి కానిస్టేబుల్ కనకయ్యను ప్రసాద్ తీసుకెళ్లాడు. దేవీలాల్ నోటీసు ఇచ్చి సంతకం చేయాలని కోరగా అతడి అనుచరులు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. కానిస్టేబుల్ వారి నుంచి తప్పించుకొని పటాన్ చెరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దేవీలాల్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కానిస్టేబుల్ పై దాడి… నలుగురు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -