కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం
మన తెలంగాణ/కీసర: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్‌కు చెందిన వల్లపు బిక్షపతి (36), ఉష (30) దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నాగారంకు వచ్చి వెస్ట్ గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. భిక్షపతి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె హర్షిణి (11), కుమారుడు యశ్వంత్ (10) ఉన్నారు. బిక్షపతి నివాసం ఉండే ఇంటి పక్కన వాటర్ ప్లాంట్‌లో ఓ మహిళ తన 15 సం వత్సరాల కూతురుతో కలిసి ఉంటుంది. ఆమే కూతురు మూడు నెలల గర్భవతి కావడంతో అందుకు బిక్షపతి కారణమని ఆరోపిస్తూ బాలిక కుటుంబ సభ్యులు, సమీపంలోని భవానీ నగర్ కాలనీ వాసులు గురువారం రాత్రి అతనిపై దాడి కి పాల్పడ్డారు.
100 నంబరుకు ఫోన్ చేసి భిక్ష పతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికి పలువురు శుక్రవారం ఉదయం పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటా మని చెప్పి పంపారు. శుక్రవారం ఉదయం బిక్షపతి ఆటో తీసుకొని బయటకు వెలుతుండగా బాలిక కుటుంబ సభ్యులు అడ్డుకొని మరోసారి కొట్టారు. దీంతో మనస్థాపానికి గురైన బిక్షపతి ఇంట్లోకి వెళ్లి మొదట తన భార్య, ఇద్దరు పిల్లల కు ఉరివేసి తర్వాత తాను తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి కీసర పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరేందర్ గౌడ్ వెంటనే సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుషా యిగూడ ఏసీపీ శివకుమార్ పరిస్థితిని పరిశీలిం చారు. కాగా భిక్షపతి భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడటంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బాలిక గర్భంతో తనకు సంబంధం లేదని, దురుద్దేశంతో తనపై నింద వేస్తున్నారని మృతుడు భిక్షపతి పేర్కొ న్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం రాత్రి బాలిక కుటుంబ సభ్యులు భిక్షపతిపై దాడికి పాల్పడిన సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళితే ఇంత ఘోరం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. నలుగురి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రో డ్డుపై బైటాయించారు. ఎసిపి శివకుమార్, సీఐ నరేందర్ గౌడ్ వారికి నచ్చచెప్పి ఆందోళన విర మింప చేశారు. మృతుడు బిక్షపతి తమ చావుకు భవానీ నగర్ కాలనీకి చెందిన వారు కారణమని పేర్కొంటు ఐదు మంది పేర్లు ఓ లెటర్‌లో రాసి నట్లు తెలిసింది. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
4 members of a family allegedly commit suicide in keesara