Monday, December 23, 2024

యుపిలో గోడ కూలి: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఇతావా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున గోడ కూలి నలుగురు పిల్లలు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈతవా అధికారి అవ్నీష్ రాయ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పరిహారం అందిస్తామని వెల్లడించారు. యుపిలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో శిథిలావస్థకు చేరుకున్న గోడలు కూలిపోతున్నాయి. వర్షం ధాటికి కొన్న రోజులుగా గోడలు పూర్తిగా తడవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. గోడలకు అనుకొని పేదవారు చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News