Tuesday, January 21, 2025

భారీ వర్షాలతో ఘోరం నాలాలో కొట్టుకుపోయిన పసికందు

- Advertisement -
- Advertisement -

థానే : మహారాష్ట్రలో ఇప్పటి భారీ వర్షాల దశలో ఘోరం జరిగింది. బుధవారం భారీ వర్షాల నడుమ థానేలో పొంగిపొర్లిన ఓ నాలాలో నాలుగు నెలల పసికందు కొట్టుకుపోయింది. అంబర్‌నాథ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల నడుమ సెంట్రల్ లైన్‌లో రైళ్లన్ని నిలిచిపోయిన దశలో ప్రమాదం జరిగింది. ఓ పాతిక ఏండ్ల తల్లి యోగితా రుమాలే తన భుజాలపై శిశువును ఎత్తుకుని ఆగిపోయిన రైలు దిగుతుండగా తడబడి పక్కనే ఉన్న నాలా ప్రవాహంలో పడింది. ఈ దశలో పసికందు కొట్టుకువెళ్లిందని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఘటన గురించి తెలియగానే స్థానిక రైల్వే పోలీసు బృందాలు అక్కడికి వచ్చి, కొట్టుకుపోయిన పసికందు కోసం గాలింపు చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News