Thursday, January 23, 2025

ఛత్తీస్‌గఢ్ హాస్పిటల్‌లో నలుగురు నవజాత శిశువులు మృతి

- Advertisement -
- Advertisement -

అంబికాపూర్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుర్గుజా జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్‌లోని స్పెషల్ నియోనటాల్ కేర్ యూనిట్(ఎస్‌ఎన్‌ససియూ)లో తెల్లవారు జామున 5.30 గంటల నుంచి 8.30 గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో నలుగురు నవజాత శిశువులు చనిపోయారు. ఈ విషయాన్ని రాయ్‌పూర్‌లో కలెక్టర్ కుందన్ కుమార్ విలేకరులకు తెలిపారు. “నలుగురు నవజాత శిశువులు క్రిటికల్ కండిషన్‌లో హాస్పిటల్‌లోని స్పెషల్ నియోనటాల్ కేర్ యూనిట్‌లో చేరారు. వారిలో ఇద్దరు వెంటిలేటర్ సపోర్టు మీద ఉన్నారు” అని ఆయన తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఉదయం 1 నుంచి 1.30 గంటలకు విద్యుత్తు సరఫరా ఫ్లక్చుయేషన్‌కు గురయింది. తర్వాత దానిని సరిచేశారు. అయితే ఆ ఫ్లక్చుయేషన్ స్పెషల్ నియోనటాల్ కేర్ యూనిట్(ఎస్‌ఎన్‌సియూ)నైతే ప్రభావితం చేయలేదు. దానికి వేరే ప్రత్యేక సరఫరా ఉందని ఆయన తెలిపారు. ఎస్‌ఎన్‌సియూలో కనీసం 30 నుంచి 35 వరకు శిశువులు చికిత్స పొందుతున్నారని హాస్పిటల్ అధికారులు తెలిపారు. ఈ ఉదంతంపై పరిశోధన జరుగుతోంది. శిశువుల మరణాల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. చనిపోయిన ఆ నలుగురు శిశువుల మెడికల్ రిపోర్టును త్వరలో విడుదల చేస్తారని ఆయన తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టిఎస్ సింగ్ దేవ్ ఓ టీమ్ ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయ యుకే శిశువుల మరణాలపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News