Sunday, December 22, 2024

బెలోచిస్థాన్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి… నలుగురు సైనికుల మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని కల్లోలిత బెలోచిస్థాన్ లో బుధవారం తెల్లవారు జామున సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రావిన్స్ ఉత్తర ప్రాంతంలో ఝోబ్ సైనిక స్థావరంపై ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ఉగ్రవాదులు కూడా మృతి చెందారు.

ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక మహిళ, మరో ఐదుగురు పౌరులు మృతి చెందారని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ కు చెందిన ఆర్మీ మీడియా విభాగం వెల్లడించింది. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్ ఇ జిహాద్ పాకిస్థాన్ అనే ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. బెలోచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ కుడోస్ బిజెంజో ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని వెంటనే ఎదుర్కొన్నందుకు సైనికులను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News