న్యూఢిల్లీ : దసరా పండగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం కరవు భత్యం పెంచుతున్నట్టు ప్రకటించింది. 2022 జులై 1 నుంచి ఈ పెంపు అమలు చేస్తారు. ఇందువల్ల 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. పెంచిన డీఏతో ప్రభుత్వంపై రూ.6591.36 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (సీసీఈఏ ) సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం నాడు మీడియాకు తెలిపారు. క్యాబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను కూడా ఆయన వివరించారు. మూడు ప్రధానమైన రైల్వే స్టేషన్ల రీ డెవలప్‌మెంట్ కోసం భారతీయ రైల్వేలు చేసిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి తెలిపారు ఈ రైల్వేస్టేషన్లలో న్యూఢిల్లీ, అహ్మదాబాద్, సిఎస్‌ఎంటీ , ముంబై ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు సుమారు రూ. 10,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు
- Advertisement -
- Advertisement -
- Advertisement -