Sunday, January 19, 2025

ఒంటె మాంసం షాపు నిర్వహిస్తున్న నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎలాంటి అనుమతి లేకుండా ఒంటె మాంసం షాపు నిర్వహిస్తున్న నలుగురు నిందితులను ఆసిఫ్‌నగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, ఆసిఫ్‌నగర్, సయిద్ ఆలీగూడకు చెందిన మహ్మద్ అల్తాఫ్, ఎండి ఆష్పాక్, ఎండి హాజీ, షేక్ ఫక్రుద్దిన్ అలియాస్ షేక్ సుల్తాన్ కలిసి ఒంటె మాంసం విక్రయించే షాపు నిర్వహిస్తున్నారు.

నిందితులు ఎలాంటి అనుమతి లేకుండా షాపును నిర్వహిస్తున్నారు. వారు 11 ఒంటెలను తమకు చెందిన కాంపౌండ్‌లో పెంచుతున్నారు. వాటికి సరిగ్గా తిండి కూడా పెట్టడంలేదు. ఈ విషయం ఆసిఫ్‌నగర్ పోలీసులకు తెలియడంతో దాడి చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒంటెలను జిహెచ్‌ఎంసి వెటర్నరీ అధికారులకు అప్పగించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆసిఫ్‌నగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News