Sunday, January 19, 2025

ఇండియానా మాల్‌లో దుండగుడి కాల్పులు.. నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

గ్రీన్‌వుడ్(అమెరికా): ఇండియానాపోలిస్‌లోని ఒక మాల్‌లో ఆదివారం సాయంత్రం ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పుల జరిపిన వ్యక్తిని మరో పౌరుడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. గ్రీన్‌వుడ్ పార్క్ మాల్‌లోని ఫుడ్ కోర్టులోకి రైఫిల్, మందుగుండుతో ప్రవేశించిన వ్యక్తి అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని, అక్కడే ఉన్న ఒక సాయుధ వ్యక్తి జరిపిన కాల్పులలో దుండగుడు మరణించాడని గ్రీన్‌వుడ్ పోలీసు చీఫ్ జిమ్ ఐసన్ సోమవారం తెలిపారు. తమ దేశంలో ఈ తరహా సంఘటన మరోసారి జరగడం బాధాకరమని ఆయన చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఫుడ్ కోర్టు సమీపంలోని బాత్‌రూమ్‌లో ఒక అనుమానాస్పద బ్యాగ్ లభించినట్లు ఐసన్ తెలిపారు.

4 Shot dead in Indiana Mall in US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News