Wednesday, January 22, 2025

అమెరికాలో నలుగురిని కాల్చి పరారీ అయిన దుండగుడు

- Advertisement -
- Advertisement -

 

Suspect Marlo

ఓహియో: అమెరికాలోని ఓహియోలో స్టీఫెన్ మార్లో అనే నిందితుడు నలుగురిని శక్రవారం కాల్చి చంపాడు. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఓహియో పట్టణానికి ఉత్తరాన ఉన్న డేటన్ పట్టణంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. “స్టీఫెన్ మార్లో చాలా ప్రమాదకర మనిషి” అని బట్లర్ టౌన్‌షిప్ పోలీస్ చీఫ్ జాన్ పోర్టర్ తెలిపారు. తమకు ఎఫ్‌బిఐ, ఏటిఎఫ్, మోంట్‌గోమెరి కౌంటీ షరీఫ్ కార్యాలయం కూడా తోడ్పడుతున్నాయని కూడా ఆయన తెలిపారు. నేరస్థుడు మార్లో ఓహియో నుంచి పారిపోయాడని కూడా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అతడికి లెగ్జింటన్, కెంటుకీ, ఇండియానపోలీస్, చికాగో వంటి నగరాలతో కూడా సంబంధాలున్నాయని ఎఫ్‌బిఐ మీడియాకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News