- Advertisement -
విశాఖ మహారాణిపేటలో నలుగురు విద్యార్థులు మిస్ అయ్యారు. లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలని విద్యార్థులు నలుగురు పరారయ్యారు. తాము కూడా డబ్బు సంపాదించి లగ్జరీ లైఫ్ గడుపుమని చెప్పి వెళ్లిపోయారు. ఇళ్లు, కార్లు కొన్నాకే ఇంటికి తిరిగి వస్తామని చెప్పి వెళ్లిపోయారు. కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ్, రఘు నలుగురు కలసి పరారయ్యారు. సోమవారం రాత్రి లక్కీ భాస్కర్ సినిమా చూసిన అనంతరం తాము కూడా సంపాదించాలని పరారయ్యారు. ఈవిషయాన్ని వాళ్లు తోటి విద్యార్థులకు చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది. పారిపోయిన నలుగురు విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. వాళ్ల తల్లిదండ్రులు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినిమాల ప్రభావం చిన్నారులుపై ఎంతగా పడుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ అని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.
- Advertisement -