Monday, December 23, 2024

ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతం..

- Advertisement -
- Advertisement -

ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చారు. బుధవారం ఉదయం జమ్మూ శివారులో అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కును చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అపారు. అనంతరం భద్రతా బలగాలు ట్రక్కును సెర్చ్ చేస్తుండగా డ్రైవర్ దిగి పారిపోయాడు. తర్వాత ట్రక్కు లోపల ఉన్న నలుగురు ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు ట్రక్కుపై కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు.

కాల్పులకు ట్రక్కుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. పారిపోయిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని, ఘటనాస్థలం నుంచి ఏడు ఎకె 47-రైఫిల్స్, ఒక ఎం4 కార్బైన్, మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని జమ్మూ అడిషనల్ డిజిపి ముకేశ్ సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News