Monday, January 20, 2025

జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. నలుగురు టెర్రరిస్టులు హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పూంచ్ జిల్లా సూరన్‌కోట్‌లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందడంతో మంగళవారం భద్రతా బలగాలు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News