Monday, January 20, 2025

కశ్మీరులో నలుగురు తీవ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

4 Terrorists killed in Encounter in Pulwama and Baramulla

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు తీవ్రవాదులు మరణించారు. వీరిలో ఒక జైషే మొహమ్మద్ తీవ్రవాది కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో భద్రతా బలగాలు మంగళవారం తనిఖీలు జరుపుతుండగా తీవ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ఇద్దరు తీవ్రవాదులు మరణించినట్లు వారు చెప్పారు. పుల్వామాలోని తుజ్జన్ వద్ద భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో జైషే మొహమ్మద్ తీవ్రవాదితోసహా ఇద్దరు తీవ్రవాదులు మరణించినట్లు పోలీసులు చెప్పారు.

4 Terrorists killed in Encounter in Pulwama and Baramulla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News