Sunday, January 19, 2025

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 4 వేల మంది ప్రయాణికులు

- Advertisement -
- Advertisement -

చమోలీ : ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో వరదలకు ఒక వంతెన కొట్టుకుపోవడంతో భారత్ టిబెట్ సరిహద్దు రహదారి మూసుకుపోయింది. డజను గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారి మూసుకుపోవడంతో గంగోత్రి గంగానాని మధ్య 4 వేల మంది ప్రయాణికులు చిక్కుకు పోయారు.

వరదల్లో చిక్కుకొన్న వందమందికి పైగా ఇజ్రాయెల్ పర్యాటకులు
భారత్ పర్యటనకు వచ్చిన 100 మందికి పైగా ఇజ్రాయెల్ పర్యాటకులు భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించినట్టు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. ఆందోళనకు గురైన వారి బంధువులు, బాధితులతో సంప్రదించడానికి యత్నిస్తున్నా సాధ్యం కావడం లేదని అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో చాలా చోట్ల వర్షాలకు కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఢిల్లీ లోని ఇజ్రాయెల్ కాన్సులేట్ భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News