Thursday, January 23, 2025

నీటి సంపులో పడి మృతి చెందిన నాలుగేళ్ళ చిన్నారి…

- Advertisement -
- Advertisement -

ఫరూఖ్‌నగర్: ప్రమాదవశాత్తు నీటి సంపలో పడి నాలుగేళ్ల భవ్యశ్రీ అనే చిన్నారి మృతి చెందిన ఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కందివనం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కందివనం గ్రామానికి చెందిన కె.నాగరాజు దంపతులకు ఒక కుమారుడు, కూతురు సంతానం. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం తండ్రి నాగరాజు వ్యవసాయ పనులకై పొలానికి వెళ్లడు. అయితే తల్లి పెద్ద కుమారుడుని స్కూల్‌కి పంపేదుకు ఇంటి నుండి రోడ్డుపైకి బయలు దేరింది. చిన్న కుమార్తే భవ్యశ్రీ మాత్రం పక్కింట్లో తోటి పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లింది. పక్కింట్లోకి వెళ్లిన కూతురు ఎంతకి ఇంటికి రాకపోగా ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో వెతకిన ఆచూకీ తెలియరాలేదు.

అయితే భవ్యశ్రీ పక్కింట్లోకి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు సంపు పై కప్పు మూత తెరిచి ఉండడంతో ప్రమాదవశాత్తు జారీ పడిపోయింది. ఇది గమనించని పక్కింటి మహిళ తెరిచిన సంపు మూతను మూసివేసింది. భవ్యశ్రీ అచూకీ కోసం తల్లి పలుమార్లు వెతుకుతూ అనుమానంతో పక్కింటి నీటి సంపుని తెరవగా విగత జీవిగా సంపులో తేలియాడుతూ కనిపించడంతో కన్నతల్లి ఒక్కసారిగా అక్కడే సొమ్మసిల్లింది. గంట ముందు కండ్ల కదలాడిన అల్లారు ముద్దుల చిన్నారి మృతిని జీర్ణించుకోలేని కన్నపేగు రోధన గ్రామస్థులను కలచివేసింది. భవ్యశ్రీ మృతిని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ శివజ్యోతి, ఉపసర్పంచ్ జనార్థన్‌గౌడ్‌లు కుటుంభ సభ్యులను పరామర్శించారు. సంపు పై కప్పులను తెరచి ఉంచరాదని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుడదని గ్రామస్థులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News