Monday, January 20, 2025

సిద్దిపేట జిల్లాలో అమానుషం

- Advertisement -
- Advertisement -

బురద నీటిలో చిన్నారిని తొక్కి చంపిన మేనమామ

నంగునూరు: మతిస్థిమితం లేని వ్యక్తి తన మేనకోడల్ని బురద నీళ్లలో ముంచి చంపిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రా మస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… మందపల్లి గ్రామానికి చెందిన పిట్టలు పట్టే కులస్తులు గత కొన్ని రోజుల క్రితం బద్దిపడగ గ్రామానికి వచ్చి వేముల శ్రీధర్‌రెడ్డికి చెందిన మామిడి తోటలో నివాసం ఉంటున్నారు. అదే మామిడి తోటను మామిడి పండ్ల కోసం లీజుకు తీసుకున్నారు.

అయితే గుజరాతి రాజు, సంతోషి దంపతుల కూతురు శిరీష (4) ఒంటరిగా తోటలో ఆడుకుంటుండగా బాలిక మేనమామ శ్రీను వరినాటు వేసిన బురదలో బాలికను ముంచడంతో బాలిక ఊపిరి ఆడకపోవటంతో మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు శ్రీనును చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. అయితే గతకొంతకాలంగా శ్రీనుకు సరిగా మతిస్థిమితం లేదని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటనకు చేరుకున్న రాజగోపాల్‌పేట ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

child

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News