Friday, December 27, 2024

నాలుగేళ్ల పాపపై అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: అడవి ముత్తారం మండల పరిధికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన లో భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన రాస కొమురయ్యకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 1000 జరిమానా విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ జడ్జి నారాయణబాబు శనివారం తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే… భూపాలపల్లి మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన రాస కొమురయ్య(36) 2019 డిసెంబర్ 31వ తేదీ రాత్రి అడవి ముత్తారం మండల పరిధిలోని ఓ గ్రామంలోని ఇంట్లోకి రాత్రి పూట అక్రమంగా చొరబడి అక్కడ నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని గ్రామ శివారులోకి బలవంతంగా తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు.

చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు అడవి ముత్తారం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి కాటారం డిఎస్పి బోనాల కిషన్ అత్యాచార ఘటనపై విచారణ చేపట్టి చార్జిషీట్ ఫైల్ చేశారు. గత కొంత కాలంగా రేప్ కేసులో కొమురయ్యను కోర్టు విచారించి, వాదోపవాదనలు విన్న తర్వాత రాస కొమురయ్యను దోషిగా నిర్ధారిస్తూ, 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 1వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి నారాయణబాబు తీర్పు వెలువడించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోగికార్ శివరాజునున, సమగ్ర దర్యాప్తు చేపట్టిన అప్పటి కాటారం డిఎస్పి బోనాల కిషన్‌ను, కోర్టు ట్రయల్‌ను నడిపించిన కాటారం సిఐ సంపత్‌రావును, అడవి ముత్తారం ఎస్‌ఐ రమేష్‌ను సాక్షులను ప్రవేశపెట్టిన ఏఎస్‌ఐ వెంకన్న, హెడ్‌కానిస్టేబుల్ భూమయ్యలను జయశంకర్ భూపాలపల్లి ఎస్పి జె సురేందర్‌రెడ్డిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News