- Advertisement -
జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్‌లో నాలుగేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో అద్దెకు ఉన్న ఖాజా అనే వ్యక్తి ఇంటి పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై కన్నేశాడు. శుక్రవారం ఎవరు లేని సమయంలో చిన్నారిని తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతుండగా.. తమ పాప కనిపించలేదని వెతుక్కుంటూ వెళ్లిన తల్లి ఖాజా ఇంట్లో చూడగా అసలు విషయం బయట పడింది. విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పోలీసులు వచ్చే సమయానికి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై టూ టౌన్ సిఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.
- Advertisement -